Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
ఎన్నేళ్లకు అర్థమవుతుందో!
వందల్లో శిక్షణ కార్యక్రమాలు.. వేలల్లో అధికారుల హాజరు.. రూ.లక్షల్లో ఖర్చు.. ఉపయోగం శూన్యం! కఠినంగా ఉన్నా ఇదే వాస్తవం
హోద్యమకారులను ఒకసారి పలకరించండి... సమాచార హక్కు చట్టంలోని నిబంధనలన్నింటినీ గడగడా చెప్పేస్తారు. లోతుగా విశ్లేషిస్తారు. ఆ నిబంధనలకు సంబంధించి ఏయే సందర్భాల్లో ఏయే సమాచార కమిషన్లు ఎలాంటి తీర్పులు ఇచ్చాయో వివరిస్తారు. ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలనూ గుర్తుచేస్తారు. వీరెవరికీ ఏ శిక్షణలూ ఉండవు!

అదే, ప్రజా సమాచార అధికారులు, అప్పీలేట్‌ అథారిటీలను చట్టం గురించి అడగండి... అతికొద్దిమంది తప్ప తప్ప మిగిలిన వారందరూ గందరగోళపడిపోతారు. ఏ ఒక్క నిబంధననూ సరిగ్గా చెప్పరు. పైపెచ్చు చట్టంలో ఎక్కడా లేని నియమాలను పుట్టిస్తారు.

ఎందుకీ పరిస్థితి?చట్టంపై ఉద్యమకారులకు ఉన్న అవగాహన అధికారులకు ఎందుకు ఉండట్లేదు?

లెక్కలు ఘనం
సెక్షన్‌ 26(1)(డి): êకేంద్ర/రాష్ట్ర ప్రజా సమాచార అధికారులకు శిక్షణ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత.

వనరులు అందుబాటులో ఉన్నంత మేరకు సహపై పీఐవోలకు శిక్షణివ్వాలని చట్టం చెబుతోంది. అందుకు తగ్గట్టుగానే డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగం (ఎంసీహెచ్‌ఆర్‌డీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌, జిల్లాకేంద్రాల్లో శిక్షణలు ఇస్తున్నారు. ఇలా గత ఏడేళ్ల వివరాలను సమాచార హక్కు చట్టం సాయంతో ‘ఈనాడు ముందడుగు’ సేకరించింది.

* 2006 - 12 మధ్యలో జిల్లాకేంద్రాల్లో 1204 కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 29,531 మందికి శిక్షణిచ్చారు. 2006 - 11లో నిర్వహించిన కార్యక్రమాలకే రూ.44.63 లక్షలు వెచ్చించారు. 2011 - 12 వ్యయ వివరాలను అధికారులు తెలియజేయలేదు.

* పైన చెప్పిన వాటికి అదనంగా హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీ ప్రాంగణంలో 211 కార్యక్రమాలను నిర్వహించారు. 7335 మంది (వీరిలో కొందరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులూ ఉన్నారు) పాల్గొన్నారు. ఖర్చు విషయం దగ్గరకు వచ్చే సరికి 2010-11 వివరాలనే వెల్లడించారు. రూ.15.88 లక్షలను ఖర్చు చేసినట్లు చెప్పారు. అయితే... ఆ ఏడాదిలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎంతమంది పాల్గొన్నారన్న సంగతిని చెప్పలేదు.

ఇవీ కలిపితే...
ఎంసీహెచ్‌ఆర్‌డీతో పాటు జిల్లాస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాల వివరాలను తెలుసుకోవడానికి ‘ముందడుగు’ ప్రయత్నించింది. సహ చట్టం అమల్లో నోడల్‌ అధికారులైన జిల్లా రెవెన్యూ అధికారులను సంప్రదించింది.

* గడిచిన ఏడేళ్లలో తాము నిర్వహించిన శిక్షణల పూర్తి వివరాలను వెల్లడించింది పద్నాలుగు జిల్లాల వారే. 983 కార్యక్రమాలతో 24,183 మందికి అవగాహన కల్పించామని చెప్పారు.

* కడపకు సంబంధించి 2010, 11, 12 వివరాలే అందుబాటులో ఉన్నాయి. మూడేళ్లలో 45 సార్లు శిక్షణలు ఏర్పాటు చేశారు. 1286 మంది పాల్గొన్నారు.

* నిర్వహించిన కార్యక్రమాల సంఖ్యను వరంగల్‌ అధికారులు చెప్పలేదు. కానీ 760 మందికి చట్టంపై శిక్షణిచ్చినట్లు తెలిపారు.

* విశాఖపట్నంలోనైతే ఒకే ఒక్కసారి 45 మందికి మాత్రమే శిక్షణిచ్చారు.

* తాము ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణ ఇవ్వట్లేదని కర్నూలు, రంగారెడ్డి జిల్లాల అధికారులు చెప్పారు.

* రాజధాని నగరానికి సంబంధించిన కార్యక్రమాలను హెచ్‌ఆర్‌డీ వాళ్లే చూసుకుంటున్నారని హైదరాబాద్‌ యంత్రాంగం పేర్కొంది.

* ప్రతి మూడు నెలలకు ఒకసారి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా వారు చెప్పారు. జట్టుకు 50 మంది పాల్గొంటున్నారన్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమాలేవి జరగట్లేదు.

* మూడు నెలలకు ఒకసారి శిక్షణిస్తున్నామని, అంతకుమించి తమ దగ్గర సమాచారం లేదని గుంటూరు అధికారులు చెప్పారు.
* కరీంనగర్‌ వివరాలు అందుబాటులో లేవు.

బూడిదలో పోసిన పన్నీరేనా!
న్ని వేల మందికి చట్టం అవగాహన కల్పిస్తే... క్షేత్రస్థాయిలో దాని ప్రభావం కనిపించాలి కదా. చట్టం మెరుగ్గా అమలవ్వాలి కదా. కానీ, ఏ జిల్లాలోనూ పరిస్థితులు ఆశాజనకంగా లేవు. ఏ4 పరిమాణంలోని పేజీకి రూ.2 మాత్రమే వసూలు చేయాలన్న ప్రాథమిక విషయం కూడా పీఐవోలకు తెలియట్లేదు. రూ.4, రూ.10 అడుగుతున్నారు. చాలామంది కోర్టు ఫీ స్టాంపులను దరఖాస్తు రుసుముగా అంగీకరించట్లేదు. నిధుల వ్యయం లాంటి సాధారణ సమాచారానికి కూడా సెక్షన్‌ 8, 9లను అన్వయిస్తున్నారు. దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు.

అప్పీలేట్‌ అథారిటీలైతే సరే సరి. మొదటి అప్పీళ్లపై నిర్ణయం తీసుకోవడంతో తీవ్ర జాప్యం చేస్తున్నారు. బాధితుడి వాదనలోని వాస్తవాలను పరిశీలించకుండా పీఐవోల పక్షాన నిలుస్తున్నారు. 

రూ.అరకోటికి పైగా ఖర్చు చేసి నిర్వహించిన శిక్షణలతో సాధించిందేంటి మరి! చట్టం తెలియకే తప్పు చేశామని రాష్ట్ర కమిషన్‌లో విచారణకు వచ్చే పీఐవోలు చెబుతున్నారు. ఎందుకు తెలియదని అక్కడి వారు ప్రశ్నించరు. వీరు జవాబివ్వరు! 

31 సెక్షన్లతో, సులభమైన భాషలో ఉండే చట్టాన్ని అర్థం చేసుకోలేని స్థాయిలో మన యంత్రాంగం ఉందా? శిక్షణిచ్చిన తర్వాతా ఇదే మాట చెబుతుంటే నమ్మడమెలా!

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

ఉప్పల్‌లో పరుగుల పండగ

మ్యాచ్‌ అంటే ఇదీ.. ఆడేది సినిమావాళ్లే అయినా, అంతర్జాతీయ మ్యాచ్‌కి ఏమాత్రం తీసిపోదు. టీ ట్వంటీలో ఉండే అసలైన మజా... మరోసారి తెలిసొచ్చింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net