విండీస్‌తో వన్డేకు సిద్ధమవుతున్న టీమిండియా
close

తాజావార్తలు

విండీస్‌తో వన్డేకు సిద్ధమవుతున్న టీమిండియా

గువహటి: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌ జట్టుతో టీమిండియా తన తొలి వన్డేను ఆదివారం ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గువహటి చేసుకున్న భారత ఆటగాళ్లు ముమ్మర సాధన చేస్తున్నారు. ఆటగాళ్ల సాధనకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ధోని, కేఎల్‌ రాహుల్‌, ఉమేష్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ తదితరులు కసరత్తులు చేస్తూ కనిపించారు.

ఆసియాకప్‌నకు విరామం తీసుకున్న విరాట్‌ మళ్లీ వన్డే జట్టులో పునరాగమనం చేశాడు. అక్టోబరు 12న జరిగే తొలి వన్డేకు 14మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అరంగేట్ర టెస్టులో అదరగొట్టిన యువ ఆటగాడు రిషబ్‌పంత్‌ ఈసారి మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 184 పరుగులు చేసిన పంత్‌ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇప్పుడు తొలి వన్డేలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.


రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.