kalanjali_200
Comments
-
Recommend
0
Views
0
పారిశ్రామికోత్పత్తి పడక
వరుసగా రెండో నెలా ప్రతికూలమే
16 నెలల గరిష్ఠానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం
దిల్లీ: ఆర్థిక వ్యవస్థ పురోగమనం దిశగా సాగుతోందనే ఆశలకు భిన్నమైన గణాంకాలు వెలుగుచూశాయి. వరుసగా రెండోనెల డిసెంబరులోనూ పారిశ్రామికోత్పత్తి ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. గత డిసెంబరులో పారిశ్రామికోత్పత్తి 1.3 శాతం క్షీణించగా, జనవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 16 నెలల గరిష్ఠస్థాయి 5.69 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో ఆర్థిక పురోగమనానికి అవసరమైన చర్యలను వచ్చే బడ్జెట్‌లో ప్రవేశ పెట్టాలని పారిశ్రామిక సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.

కేంద్ర గణాంకాల కార్యాలయం గణాంకాల ప్రకారం..
* వరుసగా రెండో నెలా పారిశ్రామికోత్పత్తి సూచీ క్షీణించింది. గత డిసెంబరులో ఐఐపీ 1.3 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. భారీ యంత్ర పరికరాలు, తయారీరంగం క్షీణించడమే ఇందుకు కారణం. 2014 డిసెంబరులో పారిశ్రామికోత్పత్తి 3.6 శాతం పెరగడం గమనార్హం. అయితే 2015 నవంబరు నాటి ఐఐపీ 3.4 శాతం క్షీణతతో పోలిస్తే, పరిస్థితి కాస్త మెరుగైంది.

* ఐఐపీలో 75 శాతానికి పైగా వాటా ఉండే తయారీ రంగం 2015 డిసెంబరులో 2.4 శాతం క్షీణించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఈ విబాగం 4.1 శాతం వృద్ధి చెందింది. మొత్తం 22 పారిశ్రామిక విభాగాల్లో 10 ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి.

* యంత్ర పరికరాల ఉత్పత్తి 19.7 శాతం క్షీణించింది. 2014 డిసెంబరులో వృద్ధి 6.1 శాతం కావడం గమనార్హం.

* గనుల రంగం మాత్రం 1.7 శాతం క్షీణత నుంచి 2.9 శాతం వృద్ధి చెందింది.

* ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబరు నెలల్లో పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 3.1 శాతంగా నమోదు కాగా.. 2014 ఇదే సమయంలో 2.6 శాతంగా ఉంది. ఇదే సమయంలో మన్నికైన వినియోగ ఉత్పత్తుల రంగం 15.9 శాతం క్షీణత నుంచి 11.9 శాతం వృద్ధిని పొందింది.

ద్రవ్యోల్బణం 5.69 శాతం

వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2016 జనవరి నెలకు 5.69 శాతంగా నమోదైంది. 16 నెలల గరిష్ఠస్థాయి ఇది. 2014 సెప్టెంబరులో నమోదైన రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.46 శాతం తరవాత, ఇదే అదికం. 2015 జనవరిలో ఇది 5.19 శాతం కాగా, 2015 డిసెంబరులో కూడా 5.61 శాతం కావడం గమనార్హం. కూరగాయలు, తృణధాన్యాల ధరలు పెరగడం వల్లే రిటైల్‌ ద్రవ్యోల్బణం అధికం అయ్యింది. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం 6.85 శాతంగా నమోదైంది.
Your Rating:
-
Overall Rating:
0

ఆన్‌లైన్‌లో సమాచారం ఇస్తే...పోలీసులే చూసుకుంటారు

‘‘సర్‌... నాపేరు రమేష్‌ యాదవ్‌... సికింద్రాబాద్‌లో ఉంటున్నా. నా ద్విచక్ర వాహనాన్ని అమ్మి 16 నెలలయింది. రెండు నెలల నుంచి ఇంటికి ఇ-చలానాలు వస్తున్నాయి.

స్థానిక పాలన స్తంభన

పల్లె పాలనలో పారదర్శకత తేవడానికి, ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో తీసుకురావడానికి అన్ని గ్రామపంచాయతీలను డిజిటల్‌గా మార్చారు. తడి, పొడి చెత్త వేరుచేసి గ్రామానికి దూరంగా...

ఏడు కొండలవాడు..

రథసప్తమి పర్వదినాన.. శ్రీనివాసుని భక్తకోటి ఆరాధించనుంది. మాఘశుద్ధ సప్తమి పర్వదినాన సూర్యజయంతి సందర్భంగా అరుణోదయ కాలంలో స్నానం చేయడం, సూర్యుణ్ణి ధ్యానించడం...

కలిసి సాగితే.. కదులు జలం

జిల్లా వాసుల తాగునీటి అవసరాల కోసం ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల ప్రారంభమైంది. పురపాలక, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీరాజ్‌, నీటి పారుదల...