close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నన్నొక్కణ్నే తప్పు పడుతున్నారే?

ఇళ్ల అవకతవకలపై మంత్రులు మాట్లాడిందే చెప్పా
తిరుమల ఆస్తుల గురించి భక్తుడిగానే మాట్లాడా
విజయసాయిరెడ్డి లేఖలో వీటిపైనే నాకు ప్రశ్నలు
సమయమిస్తే నిజాలన్నీ వివరిస్తా
సీఎం జగన్‌కు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ

రాజ్యాంగంలోని 350, 350ఎ ప్రకారమే నేను పార్లమెంటులో తెలుగు భాష గురించి మాట్లాడా. పార్టీ మేనిఫెస్టో, అందులోని అంశాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉండకూడదు.
ఈనాడు, అమరావతి: ‘తిరుమల భక్తుల మనోభావాల గురించి మాట్లాడితే క్రైస్తవ వ్యతిరేకినంటున్నారు. ఇసుక, ఇళ్ల అక్రమాలపై ఆ శాఖల మంత్రులు మాట్లాడాకే నేను వ్యాఖ్యలు చేశా. కానీ మన పార్టీ సామాజిక మాధ్యమ అధిపతి (సోషల్‌ మీడియా హెడ్‌) సూచనలతో.. నన్నే లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మీరు వీలైనంత త్వరగా సమయం కేటాయిస్తే నాపై వచ్చిన ఆరోపణలన్నింటినీ వివరిస్తా’ అంటూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు సోమవారం లేఖ రాశారు.
‘విజయసాయిరెడ్డి నాకు పంపిన లేఖ లెటర్‌హెడ్‌ మన పార్టీది కాదు. మన పార్టీకి సమాన పేరుతో ఉన్న మరో పార్టీ లెటర్‌హెడ్‌. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అని ఏ ఉత్తర ప్రత్యుత్తరాలకూ వినియోగించరాదని ఎన్నికల సంఘం గతంలోనే చెప్పింది. తిరుమల వేెంకటేశ్వరస్వామి భక్తుడిగా నేను భక్తుల మనోభావాల గురించే మాట్లాడితే క్రైస్తవ వ్యతిరేకినని మీ చుట్టూ ఉన్న కొందరు అనడం ఆశ్చర్యమేసింది. లౌకిక దేశంలో ప్రజాప్రతినిధి అన్ని మతాలు, వర్గాల నమ్మకాలను గౌరవించాలి.
రాజ్యాంగబద్ధంగానే నేను హిందూ భక్తుల మనోభావాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చా. దానిపైనే విజయసాయిరెడ్డి నన్ను ప్రశ్నించారు. రాజ్యాంగంలోని 350, 350ఎ ప్రకారమే నేను పార్లమెంటులో తెలుగు భాష గురించి మాట్లాడా. పార్టీ మేనిఫెస్టో, అందులోని అంశాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉండకూడదు. నేను పార్టీకి దూరమయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు సత్యదూరమైన విషయాన్ని మార్ఫింగ్‌ వీడియో ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియోను, వాస్తవ వీడియో కాపీలను మీ వ్యక్తిగత సహాయకుడు, వైకాపా లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డిలకు పరిశీలన కోసం పంపా.
ఇసుక విధానం, ఇసుక లూటీపై మాట్లాడానని ప్రశ్నించారు. 2 లక్షల టన్నుల ఇసుక పక్కదారి పట్టిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పాకే నేనూ ఆ విషయాన్ని ప్రస్తావించా. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయని, నియంత్రించాలని గృహ నిర్మాణశాఖ మంత్రి రంగనాథరాజు పశ్చిమగోదావరి జిల్లా అధికారులను ఆదేశించారు. ఆ తర్వాతే నేను ఆ విషయం మాట్లాడా. కానీ నేనొక్కడినే మాట్లాడినట్లు నాపై సామాజిక మాధ్యమాల్లో కథనాలు ప్రచారం చేశారు. దీనికి మన సోషల్‌ మీడియా హెడ్‌ సలహానే కారణం. ఓ వెబ్‌పోర్టల్‌ విషయంలో అధీకృత ఆధారాలతో లోక్‌సభ స్పీకరుకు ఫిర్యాదు చేశా. మీరెందుకు ఆ పోర్టల్‌పై సభాహక్కుల ఉల్లంఘన పెడుతున్నారని విజయసాయిరెడ్డి లేఖలో నన్ను ప్రశ్నించారు. ఇది ఒక ఎంపీ విధులను ఆటంకపరిచే తీవ్రమైన చర్య’ అని పేర్కొన్నారు. ‘నా నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు నా దిష్టిబొమ్మను దహనం చేయమని చెప్పడం.. నేను నియోజకవర్గానికి వస్తే భౌతిక హాని తప్పదని హెచ్చరించడం చాలా బాధ కలిగించింది. స్థానికుల హెచ్చరికలతోపాటు, బయట జిల్లాల నుంచి ప్రధానంగా రాయలసీమ నుంచి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి.
విదేశీ నంబర్ల నుంచీ ఫోన్లు చేసి బెదిరించారు. నాకు రక్షణ కల్పించాలని స్థానిక పోలీసులు, జిల్లా పోలీసు అధికారులు, డీజీపీని కోరినా వారు పట్టించుకోలేదు. అందువల్లే లోక్‌సభ స్పీకరును, కేంద్ర హోం మంత్రిని ఆశ్రయించా’ అని రఘురామకృష్ణరాజు లేఖలో వివరించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.