close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వీసీల దస్త్రం వెనక్కి

తిప్పి పంపిన గవర్నర్‌ కార్యాలయం

ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామక దస్త్రాన్ని గవర్నరు కార్యాలయం వెనక్కి తిప్పి పంపింది. ఇటీవల శ్రీవేంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ, రాయలసీమ, ద్రవిడ, ఆచార్య నాగార్జున, ఆంధ్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామక దస్త్రాలను ప్రభుత్వం గవర్నరు బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు పంపింది. 20 రోజులపాటు పెండింగ్‌లో పెట్టిన ఆయన కార్యాలయం, న్యాయనిపుణుల సలహా అనంతరం వాటిని వెనక్కి పంపింది. ప్రభుత్వం నుంచి ఒక్కో విశ్వవిద్యాలయానికి ఒక్కో పేరునే సిఫార్సు చేస్తూ దస్త్రాన్ని పంపినట్లు సమాచారం.
ప్రభుత్వం చేసిన మార్పు ఇదీ.. గతేడాది డిసెంబరు 16న రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాల చట్ట సవరణకు అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చింది. సెర్చ్‌ కమిటీ అక్షర క్రమంలో ముగ్గురు వ్యక్తులతో ఒక ప్యానెల్‌ను ప్రభుత్వానికి సమర్పిస్తుందని, ప్రభుత్వ సిఫార్సుపై సదరు ప్యానెల్‌ నుంచి ఒకరిని ఉపకులపతిగా కులపతి నియమించాలని సవరణ తీసుకొచ్చారు. యూజీసీ నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకంలో ప్రభుత్వ పాత్ర ఉండదు. సెర్చ్‌ కమిటీ సూచించిన 3 పేపర్లలో నుంచి ఒకరిని కులపతి హోదాలో గవర్నరు నియమిస్తారు. కానీ అలాకాకుండా ప్రభుత్వ సిఫార్సుల మేరకు ఉపకులపతులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాల చట్టానికి సవరణలు చేసింది. ఉపకులపతుల నియామకాల్లో రాజకీయ జోక్యం తగ్గించేందుకు యూజీసీ 2010లో పలు మార్పులు తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణను సవాలు చేస్తూ గత ఆగస్టులో హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. కోర్టు తుది తీర్పునకు లోబడి నియామకాలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.