24 గంటల్లో 39,742 కేసులు

ప్రధానాంశాలు

24 గంటల్లో 39,742 కేసులు

కొవిడ్‌తో 535 మంది మృతి

దిల్లీ: దేశంలో వరుసగా రెండో రోజూ (ఆదివారం) కొవిడ్‌ కేసుల సంఖ్య పెరిగింది. మరణాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గత 24 గంటల్లో 39,742 కొత్త కేసులు బయటపడగా.. కొవిడ్‌ బారిన పడి 535 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రితం రోజుతో పోలిస్తే 645 కేసులు పెరగ్గా.. 11 మరణాలు తగ్గాయి. దేశవ్యాప్తంగా శనివారం 17,18,756 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపారు. రోజువారీ మరణాలు మహారాష్ట్రలో మళ్లీ పెరిగాయి. ఈ రాష్ట్రంలో 24 గంటల్లో 224 మంది కొవిడ్‌తో మృతి చెందారు. కేరళ (98), ఒడిశా (68) మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ మరణాల సంఖ్య 30లోపే ఉండటం.. 12 చోట్ల కొవిడ్‌ మరణాలేమీ నమోదు కాకపోవడం కొంత ఊరట.

కొత్తగా 2,252 కరోనా కేసులు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 2,252 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 84,858 నమూనాలు పరీక్షించగా వారిలో 2.65 శాతం మందికి కొవిడ్‌ ఉన్నట్లు నిర్ధారణైంది. తాజాగా 15 మంది కరోనాతో మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 19,54,765కు చేరాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని