20న తెదేపాలో చేరతాం

ప్రధానాంశాలు

20న తెదేపాలో చేరతాం

మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: తన కుమారుడు భూపేష్‌రెడితో కలిసి తెదేపాలో చేరనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ చదిపిరాళ్ల నారాయణరెడ్డి తెలిపారు. ఈ నెల 20న విజయవాడలో తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరతామని వెల్లడించారు. ఈ సందర్భంగా కడప జిల్లా జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జిగా భూపేష్‌రెడ్డి పేరును చంద్రబాబు ప్రకటిస్తారని వివరించారు. ఆదివారం నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని రోజులుగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో సంప్రదింపులు జరిపామని.. అందరూ భూపేష్‌రెడ్డి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. జమ్మలమడుగులో తెదేపాకు పూర్వవైభవం తెస్తామన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని