నిర్మాణ రంగ పురోభివృద్ధికి చర్యలు: బొత్స

ప్రధానాంశాలు

నిర్మాణ రంగ పురోభివృద్ధికి చర్యలు: బొత్స

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో నిర్మాణరంగం పురోభివృద్ధికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీనిచ్చారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ క్రెడాయ్‌ ప్రతినిధులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. కరోనా కారణంగా పనులు మందగించి నిర్మాణాలు పూర్తి కానందున గతంలో జారీచేసిన భవన నిర్మాణాల ప్రణాళిక అనుమతి గడువును పొడిగించాలని ప్రతినిధులు మంత్రికి విన్నవించారు. టీడీఆర్‌ల జారీ, వాటి కాలపరిమితి, ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం, ఆన్‌లైన్‌ ప్రక్రియలో ఇబ్బందులను మంత్రి దృష్టికి తెచ్చారు. సమావేశంలో చర్చించిన అంశాలపై అధ్యయనం చేశాక త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఉత్తర్వులనిస్తామని మంత్రి భరోసానిచ్చారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని