ధరలేక దాణాగా..

ప్రధానాంశాలు

ధరలేక దాణాగా..

మాటాకు గిట్టుబాటు ధర లేక కర్నూలు జిల్లాలో అన్నదాతలు పంటను పశువులకు మేతగా వదిలేస్తున్నారు. గోనెగండ్లకు చెందిన రైతు మునిరెడ్డి అర ఎకరంలో దాదాపు రూ.18 వేలు ఖర్చు చేసి టమాటా సాగు చేశారు. దిగుబడులు ప్రారంభమైనప్పటి నుంచి 25 నుంచి 28 కిలోల పెట్టె ధర రూ.100కు మించడం లేదు. పంటను విపణికి తీసుకెళ్తే కమీషన్‌, జకాతీ, హమాలీ కూలీ అంటూ ఒక్కో పెట్టెకు రూ.50 దాకా కోత వేస్తున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడి రాదని భావించి పంటను గొర్రెలకు వదిలేశారు. 

 - న్యూస్‌టుడే, గోనెగండ్ల

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని