ప్రముఖ రంగస్థల నటుడు శివనాగిరెడ్డి కన్నుమూత

ప్రధానాంశాలు

ప్రముఖ రంగస్థల నటుడు శివనాగిరెడ్డి కన్నుమూత

కర్నూలు నగరం, న్యూస్‌టుడే: ప్రముఖ రంగస్థల నటుడు శివనాగిరెడ్డి(80) కన్నుమూశారు. తెలుగురాష్ట్రాల్లో పేరొందిన ఆయన అనారోగ్యంతో బాధపడుతూ శనివారం సాయంత్రం కర్నూలు జిల్లాలోని తన స్వగ్రామం నందవరంలో మరణించారు. శివనాగిరెడ్డి 11 ఏళ్ల వయసులో నాటక రంగంలో ప్రవేశించారు. తొలిసారిగా లవకుశ నాటకంలో లవుని పాత్ర ధరించారు. పలు ప్రదర్శనలు ఇచ్చిన ఆయనకు మూడుసార్లు నంది పురస్కారాలు దక్కాయి. ధుర్యోధనుడు, రావణ, విశ్వామిత్ర, కర్ణ పాత్రలతోపాటు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. దిల్లీ, బరంపురం, బెంగళూరు, చెన్నైల్లోనూ నాటకాలు ప్రదర్శించారు. శివనాగిరెడ్డి మృతికి పలువురు సంతాపం తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని