close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘మీ పోలింగ్‌ కేంద్రం మీకు తెలుసా’?

ఈనాడు, అమరావతి: పుర, నగరపాలక, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డుల పునర్వభజనతో ఎవరి ఓటు ఎక్కడ ఉందో, ఏ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయాలో తెలియని అయోమయం పలుచోట్ల నెలకొంది. అభ్యర్థులు తమ పరిధిలోని ఓటర్లను కలిసేందుకు ఇబ్బంది పడుతున్నారు. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇలాంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఎస్‌ఈసీ పోలింగ్‌ కేంద్రం వివరాలను ఆన్‌లైన్‌లో తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ssec.ap. gov.in రాష్ట్ర పురపాలకశాఖ కమిషనర్‌ cdma.ap.gov.in , జిల్లా కలెక్టర్‌ వెబ్‌సైట్లలో ‘పోలింగ్‌ కేంద్రం మీకు తెలుసా?’ పేరుతో లింకు ఏర్పాటు చేస్తోంది. ఓటరు గుర్తింపు కార్డు (ఈపీఐసీ) నంబరు, పేరు అందులో నమోదు చేయగానే ఏ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు కలిగి ఉన్నారు? పోలింగ్‌ కేంద్రం వివరాలు కంప్యూటర్‌ స్క్రీన్‌పై కనిపిస్తాయి. రెండు, మూడు రోజుల్లో ఈ లింక్‌ సదుపాయం అందుబాటులోకి రానుంది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు