Bigg Boss Telugu5: బిగ్‌బాస్‌లో చంటి పిల్లాడి ఏడుపు.. నటరాజ్‌ భావోద్వేగం!

సినిమా

Bigg Boss Telugu5: బిగ్‌బాస్‌లో చంటి పిల్లాడి ఏడుపు.. నటరాజ్‌ భావోద్వేగం!

హైదరాబాద్‌: కెప్టెన్సీ టాస్క్‌, ప్రేమ కథలతో గురువారం సరదాగా సాగిన ‘బిగ్‌బాస్‌’ ఎపిసోడ్‌ శుక్రవారం మళ్లీ భగ్గుమనేందుకు సిద్ధమైంది. ఎప్పటిలాగే హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్‌ ఓ టాస్క్‌ ఇచ్చాడు. అందులో ఉత్తమ/చెత్త ప్రదర్శన చేసిన వాళ్ల పేరు చెప్పాలని సూచించాడు. దీంతో ఇంటిలోని వారందరూ తమ తలలు పట్టుకుని కూర్చొన్నారు. ఎవరికి వారు తాము బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చామనుకుంటుండగా.. ఎవరు వరస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ చేశారో చెబితే, ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నారు.  ఈ సందర్భంగా నటరాజ్‌ తన మాటలతో శివతాండవం చేశారు. ‘బేసిక్‌ నాలెడ్జ్‌.. సెన్స్‌ కూడా ఉండదు.. ఎలా ఆడాలి? ఏం చేయాలో కూడా తెలియదు. ఏం చెబుతాం’ అంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వారం బెస్ట్‌/ వరస్ట్‌ ఫెర్ఫార్మర్‌ ఎవరు? ఎవరి గురించి నటరాజ్‌ శివతాండవ చేశారు? తెలియాలంటే  మరి కొద్ది గంటలు ఆగాల్సిందే! మరోవైపు బిగ్‌బాస్‌ హౌస్‌లో చంటి పిల్లాడి ఏడుపు వినిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా నటరాజ్‌ మాస్టర్‌ సతీమణి శ్రీమంతం వీడియోను హౌస్‌లో ప్రసారం చేయడంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు.




మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo