
జాతీయ- అంతర్జాతీయ
దిల్లీ: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్, సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్లను వాణిజ్యపరంగా ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వీటి నిల్వలు సరిపడా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. అయితే, దేశంలో టీకాల కొరత ఏర్పడకుండా, వీటిని ఏ మేరకు ఎగుమతి చేయాలన్నది ప్రతినెలా ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపాయి.