
గ్రేటర్ హైదరాబాద్
దొండకాయ టమాటాను మించిపోతోంది. రుచిలో కాదు.. ధరలో! ప్రస్తుతం దొండకాయలు పండే సీజన్. సాధారణంగా కిలో ధర రూ.20 ఉండాలి. మూడు రోజుల క్రితం రూ.60 ఉండగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలోని కూరగాయల మార్కెట్లో శనివారం ఏకంగా రూ.100 పలికింది. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దొండకాయలు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నుంచి దిగుమతి అయ్యేవి. అక్కడ అధిక వర్షాల కారణంగా పంట దెబ్బతింది. ప్రస్తుతం హుబ్బళ్లి నుంచి తెప్పిస్తున్నారు. ఈ కారణంగానే ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు.
-న్యూస్టుడే, డోర్నకల్