
తెలంగాణ
ప్రగతిభవన్‌లో అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తున్న మంత్రి కేటీఆర్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, బాల్క సుమన్ తదితరులు
ఈనాడు, హైదరాబాద్: అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్‌లో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఉద్యమంలోనే కాకుండా ప్రభుత్వ పాలనలోనూ అంబేడ్కర్ బాటలో నడుస్తూ సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ప్రకాశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. శాసన మండలి ప్రాంగణంలోని అంబేడ్కర్ విగ్రహానికి మండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు నివాళి అర్పించారు. శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన నివాసంలో నివాళి అర్పించారు.
కాంగ్రెస్ నేతల నివాళి
గాంధీభవన్, న్యూస్‌టుడే: భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్‌రావు, నాయకులు బక్క జడ్సన్, మెట్టు సాయికుమార్, కాల్వ సుజాత తదితరులు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.