
క్రీడలు
దక్షిణాఫ్రికా సిరీస్‌కు జట్టు ఎంపిక నేడే
దిల్లీ: దక్షిణాఫ్రికాలో ఈ నెల 26న ఆరంభమయ్యే మూడు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును బుధవారం ప్రకటించనున్నారు. చేతన్ శర్మ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేయనుంది. వరుస వైఫల్యాలతో కివీస్‌తో రెండో టెస్టుకు తుది జట్టులో చోటు కోల్పోయిన రహానె, ఫామ్‌లో లేని మరో సీనియర్ బ్యాట్స్‌మన్ పుజారాలపై వేటు వేయకపోవచ్చనే భావిస్తున్నారు. అయితే రహానెను వైస్‌కెప్టెన్‌గా తప్పించి రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశముంది. పేలవ ఫామ్‌లో ఉన్న సీనియర్ ఫాస్ట్‌బౌలర్ ఇషాంత్ శర్మను ఈ పర్యటనకు ఎంపిక చేయడం సందేహమే. సిరాజ్, ఉమేశ్ కొనసాగనుండగా.. బుమ్రా, షమి తిరిగి జట్టులోకి రానున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్ లాంటి యువ పేసర్ల పేర్లను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోవచ్చు. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు చోటు కోల్పోయిన విహారికి మళ్లీ అవకాశం దక్కొచ్చు.