క్రీడలు

Facebook Share Twitter Share Comments Telegram Share
రాణించిన కిషన్‌, విహారి

బ్లూమ్‌ఫౌంటీన్‌: ఇషాన్‌ కిషన్‌ (86 బ్యాటింగ్‌; 141 బంతుల్లో 12×4, 1×6), హనుమ విహారి (63; 170 బంతుల్లో 4×4, 1×6) రాణించడంతో దక్షిణాఫ్రికా-ఏతో మూడో అనధికార టెస్టులో భారత్‌-ఏ తొలి ఇన్నింగ్స్‌లో రెండోరోజు, మంగళవారం ఆట చివరికి 229/6 స్కోరు చేసింది. 92 పరుగులకే 4 వికెట్లు పడిన స్థితిలో కిషన్‌, విహారి జోడీ జట్టును ఆదుకుంది. అయిదో వికెట్‌కు ఈ జంట 115 పరుగులు జత చేసింది. ఆట చివర్లో విహారి, దీపక్‌ చాహర్‌ (10) ఔటైనా.. కిషన్‌ క్రీజులో ఉన్నాడు. ప్రత్యర్థి స్కోరు కన్నా భారత్‌ మరో 39 పరుగులు వెనకబడి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 249/7తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన సఫారీ జట్టు.. 268 పరుగులకు ఆలౌటైంది. దీపక్‌ చాహర్‌ 4, సైని 3 వికెట్లు తీశారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.