డీఈసెట్‌ కౌన్సెలింగ్‌ నేటి నుంచి

ప్రైవేటు కళాశాలల అనుమతులు రద్దు

ఈనాడు, అమరావతి: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఎల్‌ఈడీ) ప్రవేశాలకు నిర్వహించిన డీఈసెట్‌ కౌన్సెలింగ్‌లో ఈ ఏడాది ఒక్క ప్రైవేటు కళాశాల లేదు. రాష్ట్రంలోని 780 ప్రైవేటు డీఎడ్‌ కళాశాలల అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. వీటిల్లో కొన్ని న్యాయస్థానాన్ని ఆశ్రయించి, అనుమతుల కోసం పత్రాలను సమర్పించాయి. ఈ పత్రాలు సరైనవి కావని పేర్కొంటూ అనుమతులను నిరాకరించింది. దీంతో రాష్ట్రంలో ఈ ఏడాది ఒక్క డీఎడ్‌ కళాశాల కూడా కౌన్సెలింగ్‌లో లేవు. రాష్ట్ర వ్యాప్తంగా 14 ప్రభుత్వ డైట్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో 1,650 సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డీఈసెట్‌కు 5,800మంది హాజరు కాగా.. 4,800మంది అర్హత సాధించారు. కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను కన్వీనర్‌ దేవానందరెడ్డి విడుదల చేశారు. ఈనెల 14 వరకు ఆన్‌లైన్‌లో కళాశాలలు, సీట్ల ఎంపికకు ఐచ్ఛికాలు నమోదు చేసుకోవచ్చని, 16-18వరకు సీట్ల కేటాయింపు చేస్తామని వెల్లడించారు. ప్రవేశాల ప్రాథమిక లేఖలను 19న ఇస్తామని, జిల్లా డైట్లలో 20-22 వరకు విద్యార్హత ధ్రువపత్రాలు పరిశీలిస్తామని వెల్లడించారు. ఈనెల 31 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని