మొండి గోడలతో నిలిచిపోయిన ఇళ్లకు బిల్లులు: మంత్రి బొత్స

చీపురుపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంలో పునాదులు, స్లాబుల స్థాయిలో మొండి గోడల వరకు నిలిచిపోయిన ఇళ్లకు ప్రభుత్వం బిల్లులు మంజూరు చేసే యోచనలో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఇప్పటికే ఈ అంశం ముఖ్యమంత్రి దృష్టిలో ఉందన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంగళవారం ఆయన మాట్లాడారు. సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థపై సీఎం ఎంతో విశ్వాసంతో ఉన్నారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా అంతా పనిచేయాలని సూచించారు.


మరిన్ని

ap-districts
ts-districts