మాజీ ఎంపీ హర్షకుమార్‌ తనయుడిపై కేసు

కోరుకొండ, న్యూస్‌టుడే: తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఓ యువతి మాజీ ఎంపీ హర్షకుమార్‌ తనయుడు శ్రీరాజ్‌పై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆ యువతి సోమవారం రాత్రి రాజమహేంద్రవరంలో ఓ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి తన స్నేహితురాలితో కలిసి శ్రీరాజ్‌ కారులో గాడాల ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అక్కడ ఆయన ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. అదే కారులో తిరిగి వచ్చే క్రమంలోనూ వేధిస్తుండటంతో మార్గమధ్యంలో ఆమె వాహనం దిగి 100 నంబరుకు కాల్‌ చేశారు. కోరుకొండ, రాజానగరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను కోరుకొండ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కట్టా శారదాసతీష్‌ తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని