బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


పద వలయం!

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘త’ అక్షరంతోనే మొదలవుతాయి.

1. బరువును తూస్తుంది 2. సరదా మరోలా..  
3. బంగారానికి ఉండేది  4. ఓ లోహం 5. సమయం, సందర్భం
6. మహిళ 7. అనువాదం  8. సిద్ధంగా ఉండటం


హుష్‌.. గప్‌చుప్‌!

ఈ కింద కొన్ని ఖాళీ గడులున్నాయి. వాటిని సరైన అక్షరాలతో నింపితే, కొన్ని తీపి పదార్థాల పేర్లు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘పట్నం’లో ఉన్నాను కానీ ‘రాట్నం’లో లేను. ‘చిట్టి’లో ఉన్నాను కానీ ‘చిన్ని’లో లేను. ‘కత్తి’లో ఉన్నాను కానీ ‘సుత్తి’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘భారం’లో ఉన్నాను కానీ ‘ఘోరం’లో లేను. ‘గరుకు’లో ఉన్నాను కానీ ‘బెరుకు’లో లేను. ‘స్వార్థం’లో ఉన్నాను కానీ ‘అర్థం’లో లేను. ‘భూమి’లో ఉన్నాను కానీ ‘భూతం’లో లేను. నేనెవర్ని?జవాబులు

పద వలయం: 1.తరాజు 2.తమాషా 3.తరుగు 4.తగరం 5.తరుణం 6.తరుణి 7.తర్జుమా 8.తయారు

నేనెవర్ని? : 1.పట్టిక 2.భాగస్వామి

హుష్‌.. గప్‌చుప్‌! : 1.మైసూర్‌పాక్‌ 2.పూతరేకులు 3.అరిసెలు 4.సున్నుండలు 5.రవ్వకేసరి 6.జిలేబి 7.మడతకాజా 8.కజ్జికాయ

బొమ్మల్లో ఏముందో?: 1.చదరంగం 2.రంగవల్లి 3.వడియాలు 4.యాలకులు 5.చిలుక 6.కప్ప

తేడాలు కనుక్కోండి: 1.మంచుకుప్ప 2.పార 3.మధ్యలో చెట్టు 4.టోపి 5.మంచు మనిషి 6.స్కార్ఫ్‌


మరిన్ని