ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై తీర్పును పునస్సమీక్షించండి

కాంగ్రెస్‌ నాయకురాలి పిటిషన్‌

దిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్‌) విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ల నిర్ణయాన్ని సమర్థిస్తూ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కాంగ్రెస్‌ నాయకురాలు జయ ఠాకుర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ రిజర్వేషన్లకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లోని పేదలను మినహాయించడం సరికాదంటూ ఆమె బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడబ్ల్యూఎస్‌కు రిజర్వేషన్లు కల్పిస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. దీనిని సవాల్‌ చేస్తూ దాదాపు 40 పిటిషన్లు దాఖలు కాగా అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపి నవంబరు7న తీర్పునిచ్చింది.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు