CWG 2022: అదరగొడుతున్న రెజ్లర్లు.. దీపక్‌ పునియాకు స్వర్ణం

బర్మింగ్‌హామ్‌: మరో భారత రెజ్లర్‌ దీపక్‌ పునియా స్వర్ణాన్ని ముద్దాడాడు. తాజాగా జరిగిన పురుషుల 86 కేజీల విభాగంలో పాకిస్థాన్‌ క్రీడాకారుడు మహమ్మద్‌ ఇనామ్‌ను ఓడించి  దీపక్‌ స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక మరో రెజ్లర్‌ దివ్యా కక్‌రాన్‌ 68 కేజీల విభాగంలో టొంగాకు చెందిన లిలీని ఓడించి రజతం నెగ్గాడు. దీంతో కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ ఒక్కరోజే మూడో స్వర్ణ పతకాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకం సాధించింది. దీపక్‌ కంటే ముందు భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పునియా 65 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో కెనడాకు చెందిన మెక్‌నెల్‌ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకోగా, అనంతరం సాక్షి మాలిక్‌ 62 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో కెనడాకే చెందిన అనా గొడినెజ్‌పై విజయం సాధించి స్వర్ణ పతాకాన్ని ఎగురేసుకుపోయింది. అంతకుముందు అన్షు మాలిక్‌ రజతం నెగ్గింది. 


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని