Arthroscopy: మీ మోకీలుకు నొప్పి ఎక్కువగా ఉందా..? ఏం చేయాలో తెలుసా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ కీలు సరిగా పని చేయకపోయినా ఇబ్బందే..నొప్పితో విలవిలలాడిపోవాల్సిందే. సాధారణ పనులు కూడా చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. మందులు వాడినా పెద్దగా ఫలితం ఉండదు..అలాంటి సమయంలో కీళ్ల నొప్పులకు పరిష్కారం చూపడానికి ఆర్థ్రోస్కోపీ ఎంతో ఉపయోగపడుతుందని సీనియర్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ అఖిల్‌ దాడి తెలిపారు. శరీరంలోని కీళ్ల దగ్గర పెద్దగా కోతలు లేకుండా ఈ సర్జరీ ఉంటుందని పేర్కొన్నారు.

కీళ్లకు మరమ్మతు ఎలా..?

ఆర్థ్రోస్కోపీ సర్జరీ చాలా ప్రాచుర్యంలో ఉంది. భుజానికి, మోకీలుకు ఎక్కువగా శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. మిగతా కీళ్లకు చాలా తక్కువగా ఆపరేషన్‌ చేయాల్సి వస్తుంది. కీళ్లలోపల సమస్య ఎలా ఉందో కనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇందులో కోతలుండకపోవడంతో తొందరగా కోలుకోవడానికి వీలుంటుంది. 



మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని