తితిదేకు రూ.కోటి విరాళం

తిరుమల, న్యూస్‌టుడే: తితిదేకు చెందిన శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు సెల్‌కాన్‌ సంస్థ సీఎండీ వై.గురు దంపతులు రూ.కోటి విరాళం అందించారు. గురువారం గోకులం విశ్రాంతి భవనంలో తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డికి సంబంధిత చెక్కును అందజేశారు.

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మాస్క్‌లు ధరించాలన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం ఈవో ధర్మారెడ్డి, తిరుపతి కలెక్టర్‌ వెంకటరమణారెడ్డితో కలిసి ఛైర్మన్‌ బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని