close

తాజా వార్తలు

వీడియో: నడుస్తున్న మనిషిపై పిడుగు!

టెక్సాస్‌ (అమెరికా): టెక్సాస్‌లో నడుస్తున్న ఓ వ్యక్తిపై పిడుగుపడింది. కుప్పకూలిన అతడిని సమీపంలోని కొందరు అత్యవసర వైద్యం అందించడంతో మృత్యువు నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. టెక్సాస్‌లోని ఒక పార్కులో అలెగ్జాండర్‌ కొరియస్‌ మూడు జాగిలాలతో కలసి నడుస్తున్నాడు. అదే సమయంలో అతడిపై పిడుగు పడింది. దీని ప్రభావంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.  

సమీపంలోని కొందరు గమనించి అంబులెన్స్‌కు సమాచారమందించారు. తొలుత గుండె స్పందనలు లేకపోవడాన్ని గమనించి వెంటనే సీపీఆర్‌ (గుండె మర్థన) చేశారు. అదృష్టవశాత్తూ గుండె స్పందించింది. అనంతరం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బాధితుడికి దేహంలోని అనేకభాగాల్లో ఎముకలు విరిగినట్టు గుర్తించి చికిత్స అందిస్తున్నారు. నేరుగా పిడుగు పడినా అలెగ్జాండర్‌ ప్రాణాలతో బయటపడటం విశేషం.

 మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు