close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఒకరికొకరై!

భార్యాభర్తలు ఒకే మాటపై నిలబడాలంటే...భాగస్వామిని అర్థం చేసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

* మీ ఇష్టాయిష్టాలను భాగస్వామిపై రుద్దకుండా ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. భార్యాభర్తలిద్దరూ ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువ ఇస్తేనే కాపురం సజావుగా సాగుతుంది.
* చిన్న విషయాలు, తప్పులకు... వాదనలకు పోతే అవి పెద్దవై ఇద్దరి మధ్యా దూరం పెరుగుతుంది. ఏదైనా విషయంపై గొడవ జరిగితే... తరువాతైనా సరే అహాన్ని పక్కనబెట్టి సారీ చెప్పండి. ఇద్దరూ ఒక్కటవుతారు.
* కుటుంబ విషయాల్లో భాగస్వామికి ప్రాధాన్యం, స్వేచ్ఛ ఇవ్వండి. ఇద్దరి మధ్య రహస్యాలకు తావు లేకుండా అన్ని విషయాలు పంచుకుంటే ఎదుటివారిపై గౌరవం పెరుగుతుంది.
* ఆఫీసుకు వెళ్లేముందు టాటాలు, బైబైలు మాత్రమే కాకుండా లవ్‌యూ అనీ చెప్పండి. విరామ సమయంలో మాట్లాడేందుకు ప్రయత్నించండి. ఇవి భాగస్వామి అభద్రతను దూరం చేస్తాయి.


మరిన్ని