close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఒకరే... ఒక్కటే!

‘అఖిలా! మార్కెట్‌కు వెళ్దాం వస్తావా..?’ ఈ మాటలు ఇప్పుడొద్ధు ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు ఉండాల్సిన సమయమిది. కరోనా కౌగిట చిక్కుకోవద్దంటే సొంతవారితోనూ కొంత దూరం పాటించక తప్పదు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ సూచనలు మనసులో పెట్టుకోండి..●

* లాక్‌డౌన్‌ సమయంలో షరతులకు లోబడి ఇల్లు గడపాల్సిందే! ఎంత ఇంటిపట్టునున్నా.. అత్యవసర వస్తువుల కోసం గడప దాటక తప్పదు. బయటకు వెళ్లినా మీ చుట్టూ మీరు లక్ష్మణ రేఖ గీసుకోగలిగితే.. కరోనా భూతం మీ జోలికి రాదని గ్రహించండి. బయటి పనుల బాధ్యతను ఇంటికొకరు మాత్రమే భుజానికెత్తుకోండి. అదీ రోజులో ఒక్కసారి మాత్రమే బయటకు రావాలనే స్పృహతో ఉండండి. ఉప్పు కోసం ఒకసారి, పప్పు కోసం మరోసారి గడప దాటి తప్పు చేయొద్ధు రోజుకు ఒక్కసారే.. అదీ ఒక్కరే.. బయటకు రండి.

* బయటకు వచ్చేవాళ్లు ఒకే దుస్తులు ధరించండి. త్రీబైఫోర్‌, షార్ట్స్‌ లాంటివి కాకుండా శరీరాన్నంతా కప్పేసే దుస్తులు ధరించండి. పనులు పూర్తవ్వగానే ఇంటికి వెళ్లిపోయి.. స్నానం చేసి ఆ దుస్తులను ఉతికేయండి. దుస్తులను వేరే వాటితో కలపొద్ధు

* పర్సు, హ్యాండ్‌బ్యాగ్‌ ఏదైనా బయటకు వెళ్లిన ప్రతిసారీ ఒకటే తీసుకెళ్లండి. ఇంటికి వచ్చాక వాటిని శానిటైజర్‌తో శుభ్రం చేసి వేరుగా ఉంచండి. వాహనం విషయంలోనూ అంతే.. ఒకే బండిని నమ్ముకోండి.

* మొబైల్‌ ఫోన్‌.. ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా మనతో పాటే ఉంటోంది. షాపింగ్‌కు వెళ్లినప్పుడు ఫోన్‌ వాడకం తగ్గించండి. ఇంటికి వచ్చాక శానిటైజర్‌తో శుభ్రం చేయండి.

* లిఫ్ట్‌ డోర్‌ వేసినా, తీసినా, నంబర్లు నొక్కినా మోచేతినే ఉపయోగించండి. చేతుల వాడకాన్ని నియంత్రించండి.

* షాపింగ్‌కు వెళ్లి మళ్లీ ఇంటికి వచ్చే వరకు శరీరంలో ఎక్కడైనా దురద పుడితే చేతితో తాకకుండా ఉండండి. ఇంటికి రాగానే స్నానం చేయండి. ఈ సూత్రాలు పాటిస్తే ఏ వైరస్‌ ఏం చేయలేదని గ్రహించండి.


మరిన్ని