close

బిజినెస్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాణించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

లాభంలో 16% వృద్ధి

దిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫలితాల్లో రాణించింది. సెప్టెంబరు 30, 2020తో ముగిసిన రెండో త్రైమాసికంలో బ్యాంకు ఏకీకృత నికర లాభం రూ.7,703 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.6,638 కోట్లుగా ఉంది. ఇక ఏకీకృత ఆదాయం రూ.36,130.96 కోట్ల నుంచి రూ.38,438.47 కోట్లకు పెరిగింది. అడ్వాన్సులు 14.9 శాతం వృద్ధితో రూ.10.89 లక్షల కోట్లకు చేరుకోవడం విశేషం. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే రుణ, కార్డు లావాదేవీలు కొంత మెరుగయ్యాయని బ్యాంకు చెప్పుకొచ్చింది. స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏలు) 1.38 శాతం(రూ.12,508.15 కోట్లు) నుంచి 1.08 శాతానికి(రూ.11,304.60 కోట్లు) పరిమితమయ్యాయి. నికర ఎన్‌పీఏలు 0.42% నుంచి 0.17 శాతానికి తగ్గాయి. అయితే మొండి బకాయిలకు కేటాయింపులు మాత్రం రూ.2700.68 కోట్ల నుంచి రూ.3703.50 కోట్లకు పెంచడం గమనార్హం.

ఎండీ, సీఈఓగా శశిధర్‌ జగ్దీశన్‌: శశిధర్‌ జగ్దీశన్‌ను అదనపు డైరెక్టర్‌గా, ఎండీ, సీఈఓగా నియమించడానికి బోర్డు డైరెక్టర్లు అనుమతి తెలిపారు. ఈ నెల 27 నుంచి మూడేళ్ల పాటు ఆ బాధ్యతల్లో కొనసాగుతారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు