
తెలంగాణ
ఈనాడు, హైదరాబాద్: పదో తరగతి విద్యార్థులకు మే 3 నుంచి 8వ తేదీ వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్ఎస్సీ బోర్డు) సంచాలకులు సత్యనారాయణరెడ్డి కాలపట్టికను ఖరారు చేశారు. ఈసారి పరీక్ష విధానాన్ని మార్చినందున ప్రశ్నపత్రాలను కొత్తగా రూపొందించి పాఠశాలలకు పంపించనున్నారు.