close

తెలంగాణ

గోల్కొండ కోటలో ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్‌

గోల్కొండ, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర దినోత్సవ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆదేశించారు. ఏర్పాట్ల పరిశీలనకు మంగళవారం గోల్కొండ కోటకు వచ్చిన ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై విస్తృతంగా చర్చించారు. వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు, ఆహ్వానితులు, ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాకుండా అన్నివిధాలా ముందుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, అదనపు డీజీ జితేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు