close

జాతీయ- అంతర్జాతీయ

‘తేజస్‌’ అద్భుతం: రాజ్‌నాథ్‌

బెంగళూరు, న్యూస్‌టుడే: దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్‌’లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ గురువారం 30 నిమిషాల పాటు విహరించారు. ఈ లోహవిహంగంలో ప్రయాణించిన తొలి రక్షణ మంత్రిగా ఆయన గుర్తింపు పొందారు. బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ సంస్థ విమానాశ్రయం నుంచి రెండు సీట్ల తేజస్‌ టేకాఫ్‌ అయ్యింది. పైలట్‌గా ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ ఎన్‌.తివారీ వ్యవహరించారు. రాజ్‌నాథ్‌ కో పైలట్‌గా వెనుక సీట్లో కూర్చొన్నారు. తన జీవితంలో ఇది మరపురాని అనుభవమని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. పైలట్‌ సూచనలతో 2 నిమిషాల పాటు తేజస్‌ను ‘నియంత్రించి’నట్లు తెలిపారు. యుద్ధవిమానాలను ఎగుమతి చేసే స్థాయికి భారత్‌ చేరుకుందని చెప్పారు. తేజస్‌ను కొనుగోలు చేయడానికి ఆగ్నేయాసియా దేశాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఇందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), హెచ్‌ఏఎల్‌లను ఆయన అభినందించారు. అనంతరం డీఆర్‌డీవో ఉత్పత్తుల ప్రదర్శనను రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రారంభించారు. డీఆర్‌డీవో సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమన్నారు. నాటి మైసూర్‌ పాలకుడు టిప్పు సుల్తాన్‌ కూడా మెరుగైన రాకెట్లు వాడి బ్రిటిష్‌ సైన్యాన్ని గడగడలాడించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో ఛైర్మన్‌ జి.సతీశ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు