close

సినిమా

మహేష్‌ మేనల్లుడితో...

ల్లా జయదేవ్‌ కుమారుడు, మహేష్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్‌ కథానాయకుడిగా తెరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’,  ‘దేవదాస్‌’ చిత్రాలతో ఆకట్టుకున్న శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కిస్తారు. పద్మావతి గల్లా నిర్మాత. శనివారం ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతోంది. నరేష్‌, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. ‘‘ఇదో వినోదాత్మక కథ. గల్లా అశోక్‌లోని అన్ని కోణాల్నీ బయటకు తీసుకురావడానికి దర్శకుడు ప్రయత్నిస్తున్నార’’ని చిత్రబృందం తెలిపింది.

కథానాయిక నిధి?
ఒక్క హిట్టు పడితే చాలు పారితోషికాలు అమాంతం పెరిగిపోతుంటాయి. నిధి అగర్వాల్‌ విషయంలోనూ ఇదే జరిగింది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది నిధి. ఇప్పుడు ఆమె పారితోషికం రూ.కోటికి చేరింది. అశోక్‌ గల్లా చిత్రంలో నాయికగా నిధిని ఎంచుకున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి ఆమె రూ.కోటి పారితోషికం అందుకుంటోందని తెలుస్తోంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు