close

క్రీడలు

అయ్‌ బాబోయ్‌..ఎంత పొడవో

లఖ్‌నవూ: ‘ఇంత పొడవు ఉంటే ఎలా..? మేం గది ఇవ్వలేం’.. వెస్టిండీస్‌తో సిరీస్‌ ఆడుతున్న అఫ్గానిస్థాన్‌ను ప్రోత్సహించేందుకు వచ్చిన అభిమానికి ఎదురైన చేదు అనుభవమిది. బస కోసం ఎన్ని చోట్లా ప్రయత్నించినా అతడికి నిరాశే ఎదురైంది. దిక్కుతోచని స్థితిలో అతడు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. అఫ్గానిస్థాన్‌, విండీస్‌ మధ్య సిరీస్‌ భారత్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లను వీక్షించేందుకు అఫ్గాన్‌ నుంచి వచ్చిన షేర్‌ఖాన్‌ అనే అభిమాని అసాధారణంగా 8 అడుగుల రెండు అంగుళాల పొడవు ఉన్నాడు. దీంతో అతడికి గది ఇవ్వడానికి హోటళ్లు నిరాకరించాయి. చివరకు పోలీసుల సాయంతోనే ఓ హోటల్‌లో గది సంపాదించాడు. ఈ వార్త తెలుసుకున్న ప్రజలు అతణ్ని చూడడానికి హోటల్‌ దగ్గరకు భారీగా చేరుకున్నారు. దాంతో పోలీసులే అతణ్ని ఈ రెండు జట్ల మధ్య బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌ కోసం స్టేడియానికి తీసుకెళ్లాల్సి వచ్చింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు