close

క్రైమ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొవిడ్‌ పరీక్షలకు వచ్చి.. అనంత లోకాలకు..

నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌
మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిలో ఘటన

రెడ్డికాలనీ(మిర్యాలగూడ), న్యూస్‌టుడే: కరోనా పరీక్షల కోసం వచ్చిన ఓ మహిళ ఆసుపత్రి మెట్లపైనే ప్రాణాలు విడిచిన ఘటన శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతీయ వైద్యశాలలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన 65 ఏళ్ల మహిళ కొంత కాలంగా కొవిడ్‌ అనుమానిత లక్షణాలతో బాధ పడుతుండడంతో.. కుటుంబ సభ్యులు నిర్ధారణ పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకొచ్చారు. వచ్చిన కొద్దిసేపటికే ఆసుపత్రి మెట్ల పైనే ఆమె కుప్పకూలి పోవడంతో.. ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాజిటివ్‌గా నిర్ధారించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ సమరథ్‌ మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చిన కొద్దిసేపటికే కుప్పకూలి పోవడంతో ఆమెకు వెంటనే పరీక్షలు నిర్వహించామన్నారు. సదరు మహిళకు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉండే అవకాశమూ లేకపోలేదన్నారు. అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం పురపాలక సిబ్బందికి అప్పగించినట్లు తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు