close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
వాముతో మొటిమలు మాయం

ఇంటి వైద్యం 

యుక్తవయసులో ఎక్కువగా కనిపించే సమస్య మొటిమలు. ఆ వయసులో ఇది చాలా పెద్ద సమస్యే. మరివాటిని అదుపులో ఉంచాలంటే ఆయుర్వేదపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దామా... 

వాముతో మొటిమలు మాయం

హార్మోన్ల ప్రభావం, వంశపారంపర్యం, పీసీఓఎస్‌, ఆహారపుటలవాట్లు... ఇలా మొటిమలకు ఎన్నో కారణాలుంటాయి. కొంతమంది అమ్మాయిల్లో నెలసరికి ముందు మొటిమలు వచ్చి, ఆ తరువాత తగ్గుతాయి. వీటిని గోళ్లతో తాకినా, గిల్లినా కూడా ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది. 
ఆహారంలో మార్పులు... 
వాముతో మొటిమలు మాయంనూనె పదార్ధాలను తగ్గించాలి. చాక్లెట్లు, కేకులు, స్వీట్లు తినడం పూర్తిగా మానేయాలి. పీచు ఉండే కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు తినాలి. మంచినీళ్లు బాగా తాగాలి. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ముఖాన్ని తరచూ గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ముఖ్యంగా నిద్రపోయే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రసాయనాలు ఉన్న సౌందర్య ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించుకోవాలి. నిద్రలేమి కూడా మొటిమలు పెరగడానికి దోహదం చేస్తుంది. అందుకే రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడం అలవరుచుకోవాలి. 
పై పూతలు... 
అరచెంచా సెనగపిండి, పావుచెంచా వంట సోడా, రెండు చెంచాల పాలు లేదా పాలమీగడ తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలపై లేపనంలా పూసి, పది నిమిషాల తరువాత కడి గేయాలి. మొటిమలు తగ్గుముఖం పడతాయి. జాజికాయను గోరువెచ్చని నీటిలో అరగదీసి గంధంలా తీసుకోవాలి. ఇందులో సమానంగా పాలు కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖంపై లేపనంలా రాయాలి. మొటిమలు, వాటివల్ల వచ్చే మచ్చలు తగ్గడానికి ఈ లేపనం ఔషధంలా ఉపయోగపడుతుంది. వాము వేయించి మెత్తటి చూర్ణంలా చేసుకుని తగినంత పెరుగు కలిపి మొటిమలపై పూయాలి. 10 లేదా 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

వాముతో మొటిమలు మాయం 

కడుపులోకి.. 
చందనం, వట్టివేరు, సుగంధపాల, శొంఠి... సమానంగా తీసుకుని మెత్తటి చూర్ణంలా చేసుకుని గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ప్రతీరోజూ  చెంచా చూర్ణాన్ని కప్పు నీటిలో నాలుగు లేదా అయిదు గంటలు నానబెట్టాలి. ఆ నీటిని రెండు పూటలా కొంచెం కొంచెం తీసుకోవాలి. రక్తశుద్ధి జరిగి, మొటిమలు తగ్గుతాయి.

మీ ప్రశ్నలు ఇకపై ‌vasuayur@eenadu.net కు పంపించగలరు.


మరిన్ని