close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
సముద్రజీవుల ప్రేమిక

సొరచేపలు, ఆలివ్‌ రిడ్లీ సముద్ర తాబేళ్ల సంరక్షణకు విశేష కృషి చేస్తున్న డాక్టర్‌ దివ్య కర్నాడ్‌ను ‘గ్లోబల్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ నేచర్‌ అవార్డు’ వరించింది. ఈ పురస్కారం అందుకోనున్న మొదటి భారతీయ మహిళ ఆమె కావడం విశేషం.

ప్రస్తుతం హరియాణాలోని అశోక విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా చేస్తోందామె. మొత్తంగా ఈ పురస్కారం గెలుచుకున్న రెండో భారతీయ వ్యక్తిగా ఘనత సాధించింది. ఇంతకు మునుపు డాక్టర్‌ చారూదత్‌ మిశ్ర ఈ అవార్డు అందుకున్నారు. ప్రతి సంవత్సరం ఈ అవార్డును ముగ్గురికి ప్రదానం చేస్తున్నారు. దీని కోసం మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 125 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పురస్కారం కింద ఆమెకు 50 వేల యూరోల నగదు, పురస్కారాన్ని మే 3న నెదర్లాండ్‌లో జరిగే కార్యక్రమంలో అందజేయనున్నారు.

సముద్ర జీవుల పరిరక్షణ కోసం కర్నాడ్‌ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ప్రస్తుతం కోరమండల్‌ తీరంలో అంతరించిపోయే ప్రమాదం ఉన్న సొరచేపలు, ఆలివ్‌ రిడ్లీ సముద్ర తాబేళ్ల సంరక్షణ గురించి జాలర్లకు అవగాహన కలిగిస్తోందామె. ‘ఈ పురస్కారం వస్తుందని అస్సలు ఊహించలేదు. ఇది నిజంగా అద్భుతం. సముద్ర జీవుల రక్షణ అనేది జాలర్లపై మాత్రమే ఆధారపడదు. వినియోగదారులు కూడా దీనికి బాధ్యత వహించాలి. స్థిరమైన చేపల పెంపకం, మెరుగ్గా చేపలు పట్టే విధానం కోసం ఇప్పుడు కష్టపడుతున్నా’నని అంటారు కర్నాడ్‌.


మరిన్ని