close

తాజా వార్తలు

అది ఇంటి దొంగల పనే

వివేకా హత్య కేసులో అనుమానితుడు పరమేశ్వర్‌ రెడ్డి 

తిరుపతి : సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో అనుమానితుడిగా పోలీసులు భావిస్తున్న వివేకానందరెడ్డి సన్నిహితుడు కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన పరమేశ్వర్‌రెడ్డి తిరుపతిలో చికిత్స పొందుతున్నాడు. తిరుపతిలోని సంకల్ప ఆస్పత్రిలో అతను చికిత్స పొందుతున్నట్లు పోలీసులు గుర్తించడంతో ఆచూకీ వెలుగులోకి వచ్చింది.

అనారోగ్యంతో తాను కడప సన్‌షైన్‌ ఆస్పత్రిలో చేరినట్లు పరమేశ్వరరెడ్డి మీడియాకు తెలిపాడు. సన్‌షైన్‌ ఆస్పత్రిలో చికిత్స అందించే వైద్యుడు వ్యక్తిగత కారణాలతో తాను మూడు రోజుల పాటు అందుబాటులో ఉండనని కర్నూలుకు వెళ్లాల్సిందిగా తనకు సూచించినట్లు పరమేశ్వరరెడ్డి చెప్పాడు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం తాను కర్నూలు వెళ్లకుండా తిరుపతి వచ్చానన్నాడు. వివేకానందరెడ్డి హత్యతో తనకు ఏ సంబంధం లేదని.. అది ఇంటి దొంగల పనేనని  పేర్కొన్నాడు. పోలీసులు తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి తనపై నిందలు వేస్తున్నారని పరమేశ్వర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. మంచం దిగే పరిస్థితి లేని వ్యక్తిపై ఆరోపణలు చేస్తున్నారని పరమేశ్వర్‌రెడ్డి భార్య అన్నారు. ఇంటి దొంగలను పట్టుకోవాలి కానీ.. తమకు చెడ్డపేరు తేవడం దారుణమని పేర్కొన్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు