close

తాజా వార్తలు

‘మోదీ’.‌.. 9 లుక్స్‌ చూశారా!

ముంబయి: భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌కు ‘పీఎం నరేంద్రమోదీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో మోదీ పాత్రలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ చిత్రబృందం విడుదల చేసింది. మోదీ (వివేక్‌)ను విభిన్న గెటప్స్‌లో చూపిస్తూ తొమ్మిది లుక్స్‌ను విడుదల చేశారు. ఆదివారమే ఈ లుక్‌ను భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా చేత విడుదల చేయించాలనుకున్నారు. కానీ గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ చనిపోవడంతో కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఈ పోస్టర్‌ను సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ఈరోజు ట్విటర్ వేదికగా విడుదల చేశారు. ఒమంగ్‌కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషలతో కలిపి దాదాపు 23 భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందులో భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా పాత్రలో సినీ నటుడు మనోజ్‌ జోషి నటిస్తున్నారు. ఏప్రిల్‌ 12న సినిమాను దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు