close

ఆంధ్రప్రదేశ్

సుమలత రాళ్ల దెబ్బల నాటకం ఆడొచ్చు!

పొట్ట కూటికే యువత సైన్యంలోకి
సీఎం కుమారస్వామి అనుచిత వ్యాఖ్యలు

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి నోరుజారారు. మండ్యలో ఆయన కుమారుడు నిఖిల్‌పై పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి, సినీనటి సుమలత ఈనెల 16న రాళ్ల దెబ్బల కారణంగా తలకు కట్టు కట్టుకుంటారని బుధవారం ఎన్నికల ప్రచారంలో ఆయన ఆరోపించారు. తన కార్యకర్తలతోనే సుమలత రాళ్లతో కొట్టించుకుని సానుభూతి పెరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశారని పేర్కొన్నారు. స్పందించిన సుమలత.. సీఎం తమపై దాడికి కుట్ర పన్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఆయనే తేదీ, సమయం చెప్పడం చూస్తుంటే దాడి జరిగే అవకాశాలు మరింత స్పష్టంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

భుక్తి కోసమే సైన్యంలోకి..
రెండు పూటలా తిండి కోసమే భారతీయ యువత సైన్యంలో చేరుతోందంటూ ముఖ్యమంత్రి కుమారస్వామి మరో వ్యాఖ్య చేసి సంచలనం రేపారు. గురువారం మండ్య జిల్లాలోనే ప్రచారం సందర్భంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్య వివాదం రేపింది. భుక్తి కోసం సైన్యంలో చేరే యోధుల జీవితాలతో ప్రధాని చెలగాటం ఆడుతున్నారంటూ ఆరోపించారు. ఈ క్రమంలో సీఎం తీరును రాష్ట్ర భాజపా తీవ్రంగా ఆక్షేపించింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు