బ్రేకింగ్

breaking
17 Apr 2024 | 12:07 IST

అయోధ్యలో అద్భుతం.. బాలరాముడి నుదుటిపై సూర్యతిలకం

అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించాయి. మూడున్నర నిమిషాల పాటు ఈ అద్భుతం చోటు చేసుకుంది. 58 మిల్లీమీటర్ల పరిమాణంలో సూర్యకిరణాలు పడ్డాయి. ఏటా శ్రీరామనవమి రోజున ఈ దృశ్యం కనిపించనుంది. భక్తులు సూర్యతిలకాన్ని వీక్షించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ‘సూర్య’తిలకం పడేట్లు చేశారు.

మరిన్ని

తాజా వార్తలు