close

Published : 04/01/2021 12:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దేశీయ మ్యూచువ‌ల్ ఫండ్సు - అంత‌ర్జాతీయ స్టాక్‌లో పెట్టుబ‌డులు

ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ ఈక్విటీ  మ్యూచువ‌ల్ ఫండ్ ఇప్పుడు గ్లోబ‌ల్ స్టాక్సు కొన‌డానికి సిద్ధం అవుతోంది. గ‌త 10 సంవ‌త్స‌రాలుగా లాభాలలో అంత‌ర్జాతీయ ఈక్విటీలు దేశీయ స్టాక్‌ల‌ను అధిగ‌మించాయి.  

భార‌తీయ స్టాక్‌ల‌లో వ‌చ్చిన స‌గ‌టు 10.10% లాభాల‌తో పోలిస్తే ఎం.ఎస్‌.సి.ఐ ఆల్ కంట్రీ వ‌ర‌ల్డ్ ఇండెక్సు 14.5 శాతం లాభాలు న‌మోద‌య్యాయి.

ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్  త‌న ఈక్విటీ ఫండ్‌ను ఫ్లెక్సికాప్ ప‌థ‌కానికి మార్చ‌డంలో భాగంగా, అసెట్ మేనేజ్‌మెంట్ కో. లిమిటెడ్ అంత‌ర్జాతీయ స్టాక్సులో 35% వ‌ర‌కు పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఒక నిబంధ‌న‌ను ప్ర‌వేశ‌పెట్టింది.  నిర్వ‌హ‌ణ‌లో రూ. 12 వేల కోట్లను క‌లిగి ఉన్న ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ ఈక్విటీ ఫండ్ పేరు ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌గా మారుతుంది.

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) స‌ర్క్యుల‌ర్‌ను అనుస‌రించి, మ‌ల్టీ-క్యాప్ ఫండ్‌లు త‌మ కార్ప‌స్‌లో క‌నీసం 25% పెద్ద‌, మిడ్ మ‌రియు స్మాల్ క్యాప్ కంపెనీల‌లో పెట్టుబ‌డి పెట్టాలి.

ఇది పెట్టుబ‌డిదారుల‌కు రిస్కును త‌గ్గిస్తుంది. ఎందుకంటే ప్ర‌పంచ మార్కెట్లు దేశీయ మార్కెట్ నుండి వేరువేరు దిశ‌ల‌లో క‌దలాడ‌తాయి.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని