పిల్ల‌ల పేరుపై పీపీఎఫ్ ఖాతా.. ఎంత కాలం కొన‌సాగిస్తే ప్ర‌యోజ‌న‌కరం? - how-long-continue-investments-in-your-child-PPF-account
close

Updated : 08/06/2021 11:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిల్ల‌ల పేరుపై పీపీఎఫ్ ఖాతా.. ఎంత కాలం కొన‌సాగిస్తే ప్ర‌యోజ‌న‌కరం?

పిల్ల‌ల భ‌విష్య‌త్తును ఆర్థికంగా సుస్థిరం చేయ‌డం కోసం త‌ల్లిదండ్రులు వారి చిన్న‌తనం నుంచి పొదుపును ప్రారంభిస్తారు. ఇందుకోసం ఎంచుకునే పెట్టుబ‌డి మార్గాల‌లో ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌(పీపీఎఫ్‌) ఖాతా ఒక‌టి. చాలా మంది త‌ల్లిదండ్రులు ఖాతానైతే ప్రారంభిస్తున్నారు.. కానీ కాలం గ‌డిచే కొద్ది పెట్టుబ‌డులు త‌గ్గిస్తున్నారు. కొన్ని సంవ‌త్స‌రాల‌కు పూర్తిగా నిలిపి వేస్తున్నారు. పిల్ల‌ల కోసం పీపీఎఫ్ ఖాతాను తెర‌వ‌డం ఒక అద్భుత‌మైన ఆలోచ‌న‌. అయితే మీ పిల్ల‌ల‌కు పూర్తి ప్ర‌యోజ‌నాలు అందాలంటే.. పెట్టుబ‌డులు స్థిరంగా ఉండేట్లు చూసుకోవ‌డం, ఖాతాను పూర్తిస్థాయిలో, దీర్ఘ‌కాలం పాటు నిర్వ‌హించ‌డం కూడా ముఖ్య‌మే. 

స్థిర‌త్వం ఎందుకు?
ఉదాహ‌ర‌ణ‌కు-1 మీ 10 సంవ‌త్స‌రాల పాప కోసం పీపీఎఫ్ ఖాతాను తెరిచార‌నుకుందాం. రూ.500 నెల‌వారి కాంట్రీబ్యూష‌న్‌తో ఖాతాను ప్రారంభించి, 15 సంవ‌త్స‌రాల పాటు ఖాతాను కొన‌సాగిస్తే పాప‌కు 25 సంవ‌త్స‌రాలు వ‌చ్చేసరికి 7 శాతం వ‌డ్డీ రేటు ప్ర‌కారం దాదాపు రూ.1,60,000 వ‌స్తుంది. అప్ప‌టికి పాప చ‌దుపు పూర్తి చేసుకుని, ఉద్యోగంలో చేరి ఖాతాను మ‌రో 35 సంవ‌త్స‌రాలు కొన‌సాగిస్తే, ఇదే 7 శాతం వ‌డ్డీ రేటు ప్ర‌కారం రూ.27,86,658 నిధిని కూడ‌బెట్ట‌వ‌చ్చు. ఇక్క‌డ పెట్టుబ‌డులు కొన‌సాగించిన మొత్తం కాలం 50 సంవ‌త్స‌రాలు. 

ఉదాహ‌ర‌ణ‌-2 అదే పాప త‌న 22 ఏళ్ల‌కు చ‌దుపు పూర్తిచేసుకుని మొద‌టి ఉద్యోగంలో చేరింది అనుకుందాం. త‌ను ఉద్యోగంలో చేరిన‌ప్పుడే అంటే త‌న 22 ఏళ్ల వ‌య‌సులో రూ.500కి బ‌దులుగా నెల‌కు రూ.1000 పీపీఎఫ్ ఖాతాలో పెట్టుబ‌డి పెడితే, ఆమెకు 60 ఏళ్లు వ‌చ్చేస‌రికి 7 శాతం వ‌డ్డీ రేటు చొప్పున రూ.23,72,635 మొత్తం స‌మ‌కూర్చుగ‌ల‌దు. ఇక్క‌డ పెట్టుబ‌డులు కొన‌సాగించ‌న కాలం 38 సంవ‌త్స‌రాలు. 

మొద‌టి దానితో పోలిస్తే, రెండ‌వ సంద‌ర్భంలో పెట్టుబ‌డులు రెట్టింపు అయ్యాయి. అయిన‌ప్ప‌టికీ, త‌క్కువ మొత్తాన్ని స‌మ‌కూర్చుకోగ‌లిగారు. ఇదే కాంపౌండ్ వ‌డ్డీ ప్ర‌భావం. అందుకే వీలైనంత తొంద‌రంగా పెట్టుబ‌డులు ప్రారంభిచాల‌ని చెప్తుంటారు నిపుణులు. మొద‌టి ఉదాహ‌ర‌ణ‌లో త‌క్కువ పెట్టుబ‌డి పెట్టిన‌ప్ప‌టికీ, పెట్ట‌బ‌డులు పెట్టిన కాలం ఎక్కువ‌.  అందువ‌ల్లే కాంపౌండ్ వ‌డ్డీతో ఎక్కువ మొత్తం స‌మ‌కూరింది. 

మైన‌ర్‌తో పీపీఎఫ్ ఖాతాను తెరిచే ముందు తెలుస‌కోవాల్సిన ముఖ్య‌ విష‌యాలు..
* మైన‌ర్ త‌ర‌పున త‌ల్లిదండ్రుల‌లో ఒక్క‌రు మాత్ర‌మే ఖాతా తెర‌వ‌గ‌ల‌రు. వారు భార‌తీయులై ఉండాలి.
* గార్డియ‌న్ కేవైసి పూర్తిచేయాలి. దీంతోపాటు, మైన‌ర్ ఫోటో, వ‌య‌సును ధృవీక‌రించే ప‌త్రం(ఆధార్ లేదా జ‌న‌న న‌మోదు ప‌త్రం), మొద‌టి కాంట్రీబ్యూష‌న్‌కు సంబంధించిన చెక్కు ఇవ్వాలి. 
* మైన‌ర్‌కు 18 సంవ‌త్స‌రాలు వ‌చ్చే వ‌ర‌కు త‌ల్లిదండ్రులు ఖాతాను నిర్వ‌హించ‌వ‌చ్చు. 
* మైన‌ర్ త‌ల్లి లేదా తండ్రి లేదా చ‌ట్ట‌ప‌ర‌మైన సంర‌క్ష‌కుడు ఏడాదికి గ‌రిష్టంగా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పాప‌/బాబు త‌రపున పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. 
త‌ల్లి లేదా తండ్రి పేరున కూడా పీపీఎఫ్ ఖాతా ఉంటే.. రెండు ఖాతాల‌లోనూ క‌లిపి గ‌రిష్టంగా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మాత్ర‌మే పెట్టుబ‌డి పెట్టే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఖాతాలో పెట్టుబ‌డి పెట్టే మొత్తాన్ని విభ‌జించాల్సి ఉంటుంది. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని