ఆర్థిక సర్వే: 2021-22లో రెండంకెల వృద్ధి - GDP estimated to contract 7.7 pc in current fiscal year ending March 31
close

Updated : 29/01/2021 17:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్థిక సర్వే: 2021-22లో రెండంకెల వృద్ధి

దిల్లీ: కరోనా కారణంగా అతలాకుతలం అయిన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని ఆర్థిక సర్వే విశ్వాసం వ్యక్తంచేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వి-షేప్‌ రికవరీతో 11 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదు చేస్తుందని అంచనావేసింది. మార్చి 31తో ముగస్తున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21) వృద్ధిరేటు 7.7 (మైనస్‌) శాతం మేర క్షీణిస్తుందని పేర్కొంది. 2020-21 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ఇవాళ ప్రవేశ పెట్టారు. అనంతరం ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్‌ కేవీ సుబ్రణియన్‌ మీడియాతో సర్వే వివరాలను వెల్లడించారు. ఈ ఆర్థిక సర్వేను కొవిడ్‌ వారియర్స్‌కు అంకితమిస్తున్నట్లు సుబ్రమణియన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్థిక సర్వేకు సంబంధించిన ప్రత్యేక యాప్‌ను విడుదల చేశారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే మళ్లీ కోలుకుంటుంది గానీ, ప్రజల ప్రాణాలు కోల్పోతే తిరిగి తీసుకురాలేమన్న ఉద్దేశంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించినట్లు సర్వే అభిప్రాయపడింది.

* ప్రభుత్వం తీసుకొచ్చిన లాక్‌డౌన్‌ వల్ల 37 లక్షల కేసులు తగ్గించగలిగామని, లక్ష ప్రాణాలను కాపాడగలిగామని సర్వే పేర్కొంది. 500 కేసులు కూడా నమోదు కాకుండానే లాక్‌డౌన్‌ ప్రకటించిన తొలి దేశమని తెలిపింది.

* కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా.. తగినన్ని ఫారెక్స్‌ నిల్వలు, తయారీ రంగం నుంచి సానుకూల సంకేతాలు, దృఢమైన కరెంట్‌ ఖాతా వంటివి వి-షేప్‌ రికవరీకి దోహదం చేశాయని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది.
యూపీ, గుజరాత్‌, బిహార్‌ రాష్ట్రాలు కరోనా కేసులు పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాయి. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఎక్కువ మంది ప్రాణాలను కాపాడాయని సర్వే అభిప్రాయపడింది. కేసులు, మరణాలు నివారించడంతో మహారాష్ట్ర విఫలమైంది.

* కొవిడ్‌ సమయంలో కేవలం వ్యవసాయ రంగం మాత్రమే సానుకూల వృద్ధిని నమోదు చేసింది. లాక్‌డౌన్‌లో తయారీ, నిర్మాణ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

* ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఆర్థిక సర్వే సమర్థించింది. ఈ చట్టాల వల్ల దీర్ఘకాలంలో చిన్న, మధ్య తరహా రైతుల ఆదాయం పెరుగుతుందని పేర్కొంది. ఎక్కడైనా విక్రయించుకునే స్వేచ్ఛ వల్ల రైతులు తమ ఉత్పత్తులకు అధిక ధర పొందుతారని తెలిపింది. మార్కెట్‌ యార్డుల్లో గంటలకొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితులు ఉండబోవని పేర్కొంది.
* దేశ సార్వభౌమ క్రెడిట్‌ రేటింగ్‌ విషయంలో విదేశీ రేటింగ్‌ సంస్థల వ్యవహారంపై సర్వే అసంతృప్తి వ్యక్తంచేసింది. రేటింగ్‌ ఏజెన్సీలు పారదర్శకంగా వ్యవహరించాలని అభిప్రాయపడింది. ఆర్థిక వ్యవస్థలకు అనుగుణంగా మదింపు చేసే విధానం ఉండాలని పేర్కొంది.
* అందుబాటులో ధరల్లోని ఇల్లు అమ్మకాలు జులై నుంచి పుంజుకున్నాయని సర్వే పేర్కొంది. రియల్‌ ఎస్టేట్‌ రంగం కోలుకుందనడానికి ఇదే నిదర్శనమని అభిప్రాయపడింది.

ఆర్థిక సర్వే E-Book కోసం క్లిక్‌ చేయండి..

ఇవీ చదవండి.. 

ఒక్కరోజే రూ.3వేలు పెరిగిన వెండి

బడ్జెట్‌లో సగటు జీవి సంగతేంటో..!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని