Gold Rate: తగ్గిన పసిడి ధర - Gold declines Rs 319 silver tumbles Rs 1287
close

Updated : 27/05/2021 18:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Gold Rate: తగ్గిన పసిడి ధర

దిల్లీ: బుధవారం భారీగా పెరిగిన బంగారం ధర నేడు కాస్త తగ్గింది. దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.319లు తగ్గడంతో 48,223కు దిగొచ్చింది. మరోవైపు, వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో ధరపై రూ.1287 తగ్గడంతో 71,924కి చేరింది. నిన్న దిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.48,542గా ఉన్న విషయం తెలిసిందే.

ఇకపోతే, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పసిడి  ధర 1900 డాలర్లు కాగా.. ఔన్సు వెండి ధర 27.70 డాలర్లుగా ట్రేడవుతున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కాస్త పెరగడం వల్లే పసిడి ధరలో తగ్గుదల నమోదైనట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషకుడు తపన్‌ పటేల్‌ విశ్లేషించారు. మరోవైపు, హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర సుమారు 50,300(అన్ని పన్నులతో కలిపి)లకు పైగా ట్రేడ్‌ అవుతోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని