close

Published : 04/05/2021 11:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రూ.2 కోట్లు దాటితే డిజిటల్‌ పన్ను...! 

* అమల్లోకి నిబంధన

ఇంటర్నెట్‌డెస్క్‌: కేంద్ర ప్రభుత్వం సోమవారం డిజిటల్‌ పన్నువిభాగంలోకి  కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇంటర్నెట్‌ ఆధారంగా పనిచేసే నాన్‌రెసిడెంట్‌ టెక్నాలజీ కంపెనీల ఆదాయం రూ.2 కోట్లు దాటినా లేదా వినియోగదారుల సంఖ్య 3లక్షలకు మించిన కంపెనీలు సవరించిన పన్ను ఒప్పందాల ప్రకారం డిజిటల్‌ పన్ను పరిధిలోకి వస్తాయని పేర్కొంది. అంటే.. గూగుల్‌, ఫేస్‌బుక్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటివి కూడా ఇప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 2018-19లో ప్రవేశపెట్టిన సిగ్నిఫికెంట్‌ ఎకనామిక్‌ ప్రెజెన్స్‌ (ఎస్‌ఈపీ) నిబంధన కింద వీటిని తీసుకొచ్చింది.  ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది.

ప్రస్తుతం ఉన్న డబుల్‌ ట్యాక్సేషన్‌ లేకుండా చూసే ఒప్పందాల పరిధిలోకి ఇది రాదు. ఈ నిబంధన గూగుల్‌, ఫేస్‌బుక్‌పై పన్ను విధించాలంటే.. ఇప్పుడు అమెరికాతో ఉన్న పన్ను ఒప్పందంపై మరోసారి చర్చలు జరపాల్సి ఉంటుంది.  ప్రస్తుత ఒప్పందాల్లో మార్పులు జరగాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఆదాయం, వినియోగదారుల సంఖ్యను అతి తక్కువ నుంచి మొదలుపెట్టడంతో చాలా నాన్‌రెసిండెంట్‌ కంపెనీలు దీని పరిధిలోకి వచ్చే అవకాశాం ఉంది.

గతంలో పన్ను ఎగవేతకు ఆయుధంగా

డిజిటల్‌ యుగంలో భౌతికంగా ఆయా దేశాల్లోనే ఉంటూ వ్యాపారం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో డిజిటల్‌ రంగ సంస్థలు పలు దేశాల్లో అనుబంధ సంస్థలను సృష్టించి వాటి నుంచి పొందుతున్న సేవలకు గాను చెల్లింపుల రూపంలో భారీ ఖర్చు చూపించి వ్యాపారం చేసిన దేశాల్లో లాభాలను కప్పిపుచ్చుతున్నట్లు తేలింది. తమ భౌతిక కార్యాలయాలను పన్ను స్వర్గధామాల్లో ఏర్పాటు చేసి భారీగా సొమ్మును మిగుల్చుకొంటున్నాయి. గతంలో అమెరికాకు చెందిన ఒక డిజిటల్‌ దిగ్గజ సంస్థ అయిదేళ్లలో భారత్‌ నుంచి ఈ రకంగా రూ.16,119 కోట్లు సింగపూర్‌, ఐర్లాండ్‌లకు తరలించినట్లు సమాచారం. 2016లో యాపిల్‌ సంస్థ కూడా తమ లాభాలపై ఐరోపా దేశాల్లో పన్ను లబ్ధి కోసం ఐర్లాండ్‌కు తరలించింది. దీనిపై మండిపడ్డ ఐరోపా కమిషన్‌ జరిమానా చెల్ల్లించాలని ఆదేశించింది. భారత్‌ సహా యూకే, ఇటలీ, స్పెయిన్‌, టర్కీ, బ్రెజిల్‌, చెక్‌రిపబ్లిక్‌, ఇండొనేసియాలు పన్నుల కొరడాను ఝళిపించాయి.

భారీగా ఆర్జన

భారత్‌లో డిజిటల్‌ రంగంలో సేవలు అందించే విదేశీ సంస్థలు వాణిజ్య ప్రకటనల రూపంలో భారీగా ఆర్జిస్తున్నాయి. దీంతో ఈ సంస్థలకు ఏడాదికి లక్ష రూపాయల విలువ దాటి ఇచ్చే వాణిజ్య ప్రకటనలపై భారత ప్రభుత్వం 2016-17లో ‘ఈక్వలైజేషన్‌ లెవీ’ పేరిట పన్ను విధించింది. ఆయా సంస్థలకు ఇచ్చే వాణిజ్య ప్రకటనల విలువపై ఆరు శాతం పన్ను తగ్గించి వినియోగదారుడే ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇది మూలం వద్దే పన్ను కోతలా పనిచేస్తుంది. ఈ రకంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ రూ.900 కోట్లు వసూలు చేసింది. ‘ఈ-కామర్స్‌’ సంస్థలు భారత్‌లో వేళ్లూనుకుని చిరు వ్యాపారుల వాటాను లాక్కోవడంతో దేశీయ వర్తకుల నుంచి వచ్చే పన్నులు తగ్గాయి. దీంతో ప్రభుత్వం ‘ఈ-కామర్స్‌’ వ్యాపార విలువ ఆధారంగా పన్ను విధించింది. రెండు కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం చేసే సంస్థలపై ఏప్రిల్‌ నుంచి రెండు శాతం పన్ను వేసింది.

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని