stock market: చివరికి లాభాల్లో ముగిశాయి - Indices fluctuate ahead of F and O expiry
close

Published : 27/05/2021 16:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

stock market: చివరికి లాభాల్లో ముగిశాయి

ఇంటర్నెట్‌డెస్క్: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 97 పాయింట్ల లాభంతో 51,115 వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 15,345 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. రూపా అండ్‌ కంపెనీ, జైకార్ప్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, ఆటోమోటీవ్‌ యాక్సెల్స్‌, టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ సంస్థల షేర్లు లాభాల్లో ముగియగా.. వోక్‌హార్డ్‌, డిష్‌టీవీ ఇండియా, కర్ణాటక బ్యాంక్‌, కేఆర్‌బీఎల్‌, శ్రీరామ్‌ సిటి షేర్లు నష్టపోయాయి. బ్యాంక్‌ సూచీలు అత్యధికంగా 1.42శాతం లాభపడగా.. రియాల్టీ సూచీలు అత్యధికంగా 1.01 శాతం నష్టపోయాయి. 

మే నెల ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్ల గడవు నేటితో ముగిసిపోవడంతో కూడా సూచీల కుదుపులకు కారణమైంది. కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో చివరికి లాభాల్లోనే ముగిశాయి. దీంతో నిఫ్టీ ఆల్‌టైమ్‌ అత్యధికం వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. మరోపక్క అమెరికాకు సంబంధించిన కీలక డేటా విడుదల కానుండటంతో ప్రపంచ మార్కెట్లు అప్రమత్తంగా ట్రేడ్‌ అయ్యాయి. యూరోస్టాక్స్‌ 600 సూచీ 0.2శాతం నష్టపోయింది. జర్మనీ, లండన్‌ సూచీలు  నష్టాల్లో ఉన్నాయి. ఫ్రాన్స్‌ మార్కెట్‌ సూచీలు మాత్రం 0.1శాతం లాభపడ్డాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని