ఉద్యోగం కోల్పోతే బీమా హామీ ల‌భిస్తుందా? - Job-loss-coverage-insurance-policies
close

Published : 27/12/2020 17:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉద్యోగం కోల్పోతే బీమా హామీ ల‌భిస్తుందా?

కోవిడ్ -19 సంక్షోభం తీవ్రతరం కావడంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించ‌డంతో వివిధ‌ రంగాలలో ఉద్యోగ కోతలు జరుగుతున్నాయి. మ‌రి మీ రక్షణకు బీమా పాలసీ ఉందా? ఉద్యోగ నష్ట భీమా భారతదేశంలో ఇంకా ప్ర‌త్యేక పాల‌సీ అందుబాటులోకి రాలేదు. ఇది వ్యక్తిగత ప్రమాదం, క్లిష్టమైన అనారోగ్యం , గృహ బీమా పాల‌సీల‌లో ఒక ఫీచ‌ర్‌గా లేదా యాడ్-ఆన్‌గా వస్తుంది.

కొన్ని పాలసీలు ఉద్యోగ నష్టం వంటి ఊ హించని అనేక సంఘటనలకు ఒకేసారి మొత్తాన్ని చెల్లిస్తాయి. జీతం పొందే పాలసీదారుడు తన ఉద్యోగాన్ని కోల్పోతే, అలాంటి పాలసీలు నెలకు బీమా చేసిన మొత్తంలో (గరిష్టంగా మూడు నెలల వరకు) స్థిర శాతం (సాధారణంగా 2-3%) వరకు చెల్లిస్తాయి. మీరు ఉద్యోగ నష్టానికి క్లెయిమ్ చేయ‌డానికి 60-90 రోజుల వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంది.

వ్యక్తిగత ప్రమాద బీమా విషయంలో, గాయం లేదా అనారోగ్యం తాత్కాలిక వైకల్యానికి కారణమైతే , పాలసీదారుడు ఉద్యోగం చేయ‌లేని ప‌రిస్థితిలో ఉంటే బీమా మొత్తంలో నిర్ణీత శాతం చెల్లిస్తాయి. ఇది ముందుగా నిర్ణయించిన వారాలకు ఆదాయాన్ని భర్తీ చేస్తుంది.

కొన్ని క్లిష్టమైన అనారోగ్య ప్రణాళికలు నిర్దిష్ట గంటలు ఆసుపత్రిలో చేరితే రోజువారీగా నగదు చెల్లిస్తాయి. అలాగే, ఇది పాలసీ సంవత్సరంలో నిర్ణీత రోజులు మాత్రమే ఉంటుంది.

గృహ రుణ రక్షణ పాల‌సీలు, ఉద్యోగ నష్టం కారణంగా పాలసీదారుడు గృహ రుణ ఈఏంఐ లను చెల్లించలేకపోతే ఉద్యోగ నష్ట కవరేజీ ప్రారంభమవుతుంది. కానీ ఉద్యోగ నష్టానికి ఇక్కడ నిర్వచించిన అర్థం ఉంది. చాలా పాలసీలలో, పాలసీదారు పనితీరు లేదా ఇతర క్రమశిక్షణా కారణాల వల్ల ఉద్యోగం కోల్పోవడం వంటి కార‌ణాల‌కు హామీ ల‌భించ‌దు. కేవ‌లం ఇలా అనోకుకుండా ఉద్యోగం కోల్పోయిన ప‌రిస్థితినే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాయి. ప్రస్తుత పరిస్థితిలో, ఉద్యోగ నష్టం హామీ ల‌భిస్తుంది. అయితే ఈ యాడ్-ఆన్‌లు సాధారణంగా ఈఎంఐ లను మాత్రమే కవర్ చేస్తాయి, ఎక్కువగా ఈ మొత్తం ఈఎంఐ ల సంఖ్య లేదా విలువ పరంగా ఉంటుంది.

అయితే బీమా పాల‌సీల కోసం చూడ‌కుండా ఎటువంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కునేందుకు ముందుగానే అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేసుకోవ‌డం మేలు. దీనికోసం అనేక ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని