లాభాల్లో స్టాక్ మార్కెట్లు - Markets are in Green
close

Updated : 08/03/2021 09:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. సోమవారం సెన్సెక్స్‌ 50,654 వద్ద, నిఫ్టీ 15,002 వద్ద ట్రేడింగ్‌ మొదలు పెట్టాయి. ఉదయం 9:42 గంటల సమయానికి సెన్సెక్స్‌ 347 పాయింట్లు ఎగబాకి 50,752 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 101 పాయింట్లు లాభపడి 15,039 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.22 వద్ద కొనసాగుతోంది.

గత వారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అగ్రరాజ్యంలో ఉద్యోగాల కల్పన వేగవంతంగా కొనసాగుతోందన్న వార్తలు వాల్‌ స్ట్రీట్‌ సూచీల పరుగుకు కారణమైంది. దీంతో ప్రపంచ‌ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. ఈ సానుకూల సంకేతాల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు నేడు లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఈ పరిణామాలు నేడు దేశీయ సూచీలపై ప్రభావం చూపుతున్నాయి.

దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లో పయనిస్తుండడం విశేషం. గెయిల్‌, ఓఎన్‌జీసీ, యూపీఎల్‌, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బజాజ్‌ ఆటో లిమిటెడ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టైటాన్‌ కంపెనీ, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌ లిమిటెడ్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని