నష్టాల్లో ప్రారంభమై.. లాభాల్లోకి - Markets are in green
close

Published : 06/04/2021 09:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నష్టాల్లో ప్రారంభమై.. లాభాల్లోకి

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. మంగళవారం సెన్సెక్స్‌ 49,441 వద్ద, నిఫ్టీ 14,737 వద్ద నష్టాల్లో ట్రేడింగ్‌ మొదలు పెట్టాయి. కానీ, కొద్దిసేపట్లోనే కొనుగోళ్ల మద్దతు లభించడంతో పుంజుకొని లాభాల్లోకి ప్రవేశించాయి. ఉదయం 9:32 గంటల సమయానికి సెన్సెక్స్‌ 280 పాయింట్లు లాభపడి 49,439 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 73 పాయింట్లు ఎగబాకి 14,711 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.27 వద్ద కొనసాగుతోంది.  

అమెరికా మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఫ్యూచర్‌ ఉదయం అప్రమత్తంగా కదలాడింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు దేశీయ సూచీలకు అండగా నిలుస్తున్నాయి. ఇక దేశీయంగా పెరుగుతున్న కొవిడ్‌ కేసులపై మదుపర్లు అప్రమత్తంగానే ఉన్నారు. అలాగే ఈ వారం విడదల కానున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఫలితాలపై మదుపర్లు దృష్టి సారించారు. 

ఇంధన, లోహ, ఆటో, మౌలిక, ఐటీ, టెక్‌ రంగాల సూచీలు లాభాల్లో పయనిస్తుండగా.. బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఆర్థిక, టెలికాం రంగ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సిప్లా, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, హిందాల్కో షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. ఓఎన్‌జీసీ, టాటా కన్జూమర్‌, బ్రిటానియా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బీపీఎల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని